బ్యాటరీ నిల్వ సామర్థ్య రేసులో ఆర్‌ఐఎల్, అమరరాజా, మేఘా ఇంజనీరింగ్
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:59 AM
దేశంలో గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ అవసరాల కోసం 10 గిగావాట్ అవర్ (జీడబ్ల్యూహెచ్) అడ్వాన్స్‌డ్ కెమిస్ర్టీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ తయారీ సామర్థ్యాలను...
న్యూఢిల్లీ: దేశంలో గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ అవసరాల కోసం 10 గిగావాట్ అవర్ (జీడబ్ల్యూహెచ్) అడ్వాన్స్‌డ్ కెమిస్ర్టీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ తయారీ సామర్థ్యాలను ఏర్పాటు చేసేందుకు నిర్వహించిన అంతర్జాతీయ టెండర్‌లో 22 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), అమరరాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్, విక్రమ్ సోలార్ ఉన్నాయి. పీఎల్‌ఐ కింద ఈ బిడ్లను స్వీకరించారు. దేశీయ బ్యాటరీ తయారీ సామర్థ్యాలను విస్తరించడంలో భాగంగా దేశంలో గిగా స్థాయి ఏసీసీ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ బిడ్లను ఆహ్వానించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..