రిలయన్స్ చేతికి మన్నా హెల్త్ మిక్స్
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:54 AM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిల యన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మన్నా హెల్త్ ఫుడ్స్...
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిల యన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మన్నా హెల్త్ ఫుడ్స్ పేరుతో ఆహార ఉత్పత్తులు విక్రయించే తమిళ నాడు కంపెనీ సదరన్ హెల్త్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసిం ది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందీ ఆర్‌సీ పీఎల్ వెల్లడించలేదు. రెండు దశాబ్దాలుగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల విభాగంలో మన్నా బ్రాండ్‌కు ప్రజల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ బ్రాండ్ కింద చిరుధాన్యాల పిండి, ఓట్స్, మల్టీ గ్రెయిన్ మిక్స్, బేబీ ఫుడ్స్, మల్టీ గ్రెయి న్ డ్రింక్స్ బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కొనుగో లుతో ఆర్‌సీపీఎల్ హెల్త్ ఫుడ్స్ విభాగంలోకి కూడా విస్తరించినట్టవుతుంది. ‘‘అందుబాటు ధరల్లో ప్రపంచ నాణ్యత’’ గల ఉత్పత్తులు అందించాలన్న ఆర్‌సీపీఎల్ సిద్ధాంతానికి ఇది బలం చేకూరుస్తుందని కంపెనీ డైరెక్టర్ టీ కృష్ణకుమార్ అన్నారు. త్వరలో ఈ ఉత్పత్తులను ఆర్‌సీపీఎల్ దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రజల్లో మంచి పేరున్న ఆహార, పర్సన ల్ కేర్ కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌లో పట్టు పెంచుకోవాలని ఆర్‌సీపీఎల్ భావిస్తోంది.
ఈ వార్తలూ చదవండి:
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్