రుణాల రద్దు ప్రచారాలు నమ్మొద్దు
ABN , Publish Date - May 05 , 2026 | 05:20 AM
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు రద్దు చేయబోతున్నాయన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్...
నమ్మితే నిండా మునగడం ఖాయం: ఆర్‌బీఐ
ముంబై: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు రద్దు చేయబోతున్నాయన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రజలను హెచ్చరించింది. రుణ బకాయిలు రద్దు చేయిస్తామని అందుకు కొద్దిగా ఫీజు చెల్లించాలని ఇటీవల కొంతమంది వ్యక్తులు, సంస్థలు ప్రచారం చేస్తున్నట్టు వార్తలు రావడంతో ఆర్‌బీఐ ఈ హెచ్చరిక చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే నేరుగా మీరు రుణాలు తీసుకున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించాలని కోరింది. లేకపోతే నిండా మునగడం ఖాయమని హెచ్చరించింది. ఇలా ప్రచారం చేసే కేటుగాళ్లు, సంస్థల వివరాలను దర్యాప్తు సంస్థలకు తెలియజేయాలని కోరింది.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ