రెపో 0.75 శాతం పెరిగే చాన్స్!
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:28 AM
దేశంలో ఆహార ధరలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను...
న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధరలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరొసారి పెంచే అవకాశముందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. 2027 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి ఆర్‌బీఐ రెపో రేటును 0.75% మేర పెంచవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబరులో రెపో రేటును 0.25%, 2027 తొలి ఆరు నెలల్లో మరో 0.50% పెంచే అవకాశముందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఉన్న రెపో రేటు 5.50% నుంచి 6.25 శాతానికి చేరవచ్చని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మౌనాన్ని బలహీనతగా.. సహనాన్ని భయంగా భావించవద్దు: కోట రుక్మిణి
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి