Share News

రెపో రేటు 0.25% పెంపు!

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:49 AM

పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. రెపో రేటును 0.25 శాతం మేర పెంచవచ్చని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్‌ నిపుణులు...

రెపో రేటు 0.25% పెంపు!

  • ఆర్థికవేత్తలు, నిపుణుల అంచనా

  • నేటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ

ముంబై: పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. రెపో రేటును 0.25 శాతం మేర పెంచవచ్చని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన సమీక్షా (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమవుతోంది. బుధవారం నాడు ఎంపీసీ నిర్ణయాలను మల్హోత్రా వెల్లడించనున్నారు. పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ తీవ్రం కావడం, చమురు ధరలు, కమోడిటీ ధరలు ఇప్పటికే పెరగటంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటానికి ఆర్‌బీఐ కఠిన వైఖరిని అవలంబించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్ఠ స్థాయి 4.82 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు పలు అంతర్జాతీయ బ్యాంకు లు వడ్డీ రేట్లను పెంచడాన్ని ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటును 5.5 శాతానికి పెంచే వీలుందని వారు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 05 , 2026 | 04:52 AM