ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ షురూ
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:26 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన...
రెపో రేటుపై సస్పెన్స్
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశం శుక్రవారం కీలక రెపో రేటుపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఎస్‌బీఐతో సహా పలు బ్యాంకుల అధినేతలు, ఆర్థికవేత్తలు ఈసారి కూడా ఎంపీసీ కీలక రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచే అవకాశమే ఎక్కువని భావిస్తున్నారు.
పసిడి నిల్వలు అమ్మలేదు: ఆర్‌బీఐ
విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకునేందుకు 1,200 కోట్ల డాలర్ల విలువ చేసే బంగారాన్ని తాము అమ్మినట్టు వచ్చిన వార్తలను ఆర్‌బీఐ తోసిపుచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న 880.52 టన్నుల పసిడి నిల్వలు యథాతథంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి తమ మొత్తం విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వల్లో 16.7 శాతంగా ఉన్న పసిడి వాటా ఈ ఏడాది మే 22వ తేదీ నాటికి 16.85 శాతానికి చేరినట్టు ఆర్‌బీఐ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం