ఇక వరుస ‘వడ్డింపులు!
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:09 AM
చౌక రుణాలకు కాలం చెల్లిందా..? ఇక రుణాలపై వడ్డీ రేట్లు వేగంగా ఎగబాకనున్నాయా..? అవుననే అంటున్నారు విశ్లేషకులు. చమురు ధరాఘాతంతో అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు ఆర్‌బీఐ వరుస...
అక్టోబరు, డిసెంబరు పరపతి సమీక్షల్లో
రెపో రేటు 0.25% చొప్పున పెంచే చాన్స్
జపాన్ బ్రోకింగ్ సంస్థ నోమురా అంచనా
న్యూఢిల్లీ: చౌక రుణాలకు కాలం చెల్లిందా..? ఇక రుణాలపై వడ్డీ రేట్లు వేగంగా ఎగబాకనున్నాయా..? అవుననే అంటున్నారు విశ్లేషకులు. చమురు ధరాఘాతంతో అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు ఆర్‌బీఐ వరుస ‘వడ్డింపులకు దిగవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ వర్గాలైతే వచ్చే ఏడాది కాలంలో ఆర్‌బీఐ రెపో రేటు ఏకంగా 1.25% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అయితే, మార్కెట్ వర్గాలు భయపడుతున్నంత స్థాయిలో కాకపోయినప్పటికీ, ఈ ఏడాది చివరికల్లా రెపో రేటు అర శాతం పెరగవచ్చని జపాన్‌కు చెందిన అంతర్జాతీయ బ్రోకరేజీ సేవల సంస్థ నోమురా అంటోంది. ఈ అక్టోబరు, డిసెంబరులో నిర్వహించనున్న ద్రవ్యపరపతి సమీక్షల్లో ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం చొప్పున పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. తద్వారా రెపో రేటు ప్రస్తుతమున్న 5.25 శాతం నుంచి 5.75 శాతానికి చేరుకోవచ్చని అంటోంది. 2027 మార్చి 31 నాటికి ఆర్‌బీఐ రెపో రేటును 0.50 శాతం పెంచే అవకాశం ఉందని హెచ్‌ఎ్‌సబీసీ గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ రీసెర్చ్ రిపోర్టు అంచనా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..