వడ్డీ రేట్లపై ఇక దూకుడే!
ABN , Publish Date - Sep 16 , 2026 | 02:08 AM
దేశంలో ధరల పెరుగుదల ఆర్‌బీఐనీ కలవర పెడుతోంది. ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే...
అక్టోబరు, డిసెంబరు సమీక్షల్లో 0.25% పెంపు?
ముంబై: దేశంలో ధరల పెరుగుదల ఆర్‌బీఐనీ కలవర పెడుతోంది. ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 20 నెలల గరిష్ఠ స్థాయి 4.82 శాతానికి చేరింది. దీంతో వచ్చే నెల 5-7 తేదీల మధ్య జరిగే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ కీలక రెపో రేటును ప్రస్తుత 5.25 శాతం నుంచి 5.5 శాతానికి పెంచుతుందని ఆర్థిక విశ్లేషకుల అంచనా. ఈ రెపో రేటుపైనే ఆర్‌బీఐ బ్యాంకులకు అవసరమయ్యే స్వల్పకాలిక రుణాలు ఇస్తుంది. డిసెంబరు 2-4 తేదీల మధ్య జరిగే మలి విడత భేటీలోనూ ఆర్‌బీఐ రెపో రేటును మరో పావు శాతం పెంచే అవకాశం ఉందని డాయిష్ బ్యాంకు వంటి విదేశీ బ్రోకరేజీ సంస్థల అంచనా.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News