Share News

లోన్‌ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:37 AM

లోన్‌ (రుణ) రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్‌ పడనుంది. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గురువారం బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏజెంట్లకు...

లోన్‌ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్‌

కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్‌బీఐ

రుణగ్రహీతలకు చేసే ఫోన్‌ కాల్స్‌ రికార్డు చేయాల్సిందే..

ముంబై: లోన్‌ (రుణ) రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్‌ పడనుంది. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గురువారం బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏజెంట్లకు సరైన శిక్షణతో పాటు రుణ గ్రహీతలకు వారు చేసే ఫోన్‌ కాల్స్‌ను తప్పనిసరిగా రికార్డు చేయాలని కోరింది. రుణ వసూళ్ల కోసం బ్యాంకు ఉద్యోగులు లేదా రికవరీ ఏజెంట్లు అతిగా ప్రవర్తిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఆర్‌బీఐ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రధాన మార్గదర్శకాలు

  • ఎంపికకు ముందే బ్యాంకులు రికవరీ ఏజెంట్ల పూర్వాపరాలు తెలుసకోవాలి

  • నియమించిన తర్వాత వారికి రుణ వసూళ్లలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (ఐఐబీఎ్‌ఫ)లో సరైన శిక్షణ ఇవ్వాలి

  • రుణ వసూళ్ల కోసం ఏజెంట్లు ఖాతాదారులపై ఎలాంటి అనుచిత భాష ఉపయోగించ కూడదు

  • రుణగ్రహీతల పరువు, ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలను దెబ్బతీయకూడదు

  • రుణగ్రహీత కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు, ప్రకృత్తి విపత్తులు, పెళ్లిళ్లు, పండగల సమయంలో రుణ వసూళ్ల కోసం వారి ఇళ్లకు వెళ్లకూడదు

  • రుణగ్రహీతలకు పంపించే సందేశాలు కూడా హుందాగా ఉండాలి

  • నిర్ణీత కాలవ్యవధిలో రికవరీ ఏజెంట్లకు పునఃశిక్షణ ఇవ్వాలి

  • బ్యాంకు ఉద్యోగులు, రికవరీ ఏజెంట్ల వద్ద ఉన్న రుణ గ్రహీతల సమాచారాన్ని దుర్వినియోగం చేయకూడదు

  • రుణ వసూలు విషయం కోర్టు విచారణలో ఉంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు.. తమ ఉద్యోగులు, రికవరీ ఏజెంట్లకు చెప్పాలి.

ఇవి కూడా చదవండి..

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 13 , 2026 | 05:41 AM