బ్యాంకింగ్ వ్యవస్థలోకి మరో రూ.50,000 కోట్లు
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:10 AM
బ్యాంకింగ్ వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం బ్యాంకుల నుంచి...
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం బ్యాంకుల నుంచి రూ.50,000 కోట్ల విలువైన ప్రభుత్వ రుణ పత్రాలను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ (ఓఎంఓ) ద్వారా కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు నిధులు రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. ఈ నెలాఖరులోగా జీఎ్‌సటీ చెల్లింపులు, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల రూపంలో బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో నిధులు బయటికి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ రూ.50,000 కోట్ల ప్రభుత్వ రుణ పత్రాలను బ్యాంకుల నుంచి కొనుగోలు చేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నురచి ఆర్‌బీఐ ఓఎంఓ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.2.5 లక్షల కోట్ల లిక్విడిటీ సమకూర్చింది.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్