Share News

బ్యాంకుల డివిడెండ్లపై ఆర్‌బీఐ పరిమితులు

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:06 AM

బ్యాంకులు వాటాదారులకు చెల్లించే డివిడెండ్లపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) పరిమితులు విధించింది. ఈ డివిడెండ్ల కోసం...

బ్యాంకుల డివిడెండ్లపై ఆర్‌బీఐ పరిమితులు

ముంబై: బ్యాంకులు వాటాదారులకు చెల్లించే డివిడెండ్లపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) పరిమితులు విధించింది. ఈ డివిడెండ్ల కోసం చెల్లించే మొత్తం ఆ ఆర్థిక సంవత్సరంలో ఆ బ్యాంకు ఆర్జించే నికర లాభంలో 75 శాతం మించకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన వర్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. సంబంధిత వర్గాలు అందరితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ డివిడెండ్‌ చెల్లించిన తర్వాత ఆ బ్యాంకు మూలధనం, నిర్ణీత మొత్తానికంటే తక్కువకు పడిపోకూడదని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇక దేశంలోని విదేశీ బ్యాంకుల శాఖలు, తమ లాభాలను మాతృసంస్థలకు బదిలీ చేయాలంటే ఆయా ఆర్థిక సంవత్సరాల్లో అవి లాభాల్లో ఉండాలని కూడా స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..

Updated Date - Mar 11 , 2026 | 06:06 AM