Share News

RBI Governor Sanjay Malhotra: రూపాయి మారకానికి హద్దులు లేవు

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:39 AM

డాలర్‌తో రూపాయి మారకం రేటు ఏ స్థాయిలో ఉండాలనే దానిపై తమకు లక్ష్యాలు ఏమీ లేవని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌...

RBI Governor Sanjay Malhotra: రూపాయి మారకానికి హద్దులు లేవు

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం రేటు ఏ స్థాయిలో ఉండాలనే దానిపై తమకు లక్ష్యాలు ఏమీ లేవని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా స్పష్టం చేశారు. మారకం రేటు రూ.90 వద్ద ఉండాలా, లేక రూ.91 వద్ద ఉండాలా? అనే విషయాన్ని మార్కెట్టే నిర్ణయిస్తుందన్నారు. తమ పని తీవ్ర ఆటుపోట్లున్నప్పుడు రూపాయి మార కం రేటును స్థిరీకరించడం మాత్రమేనన్నారు. ‘ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌’ బిజినెస్‌ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

అల్‌ ఫలా వర్సిటీ క్యాంపస్‌ అటాచ్‌!

వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!

Updated Date - Jan 14 , 2026 | 05:39 AM