ఎంఎస్‌ఎంఈలకు ఊరట
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:47 AM
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ) రుణ నిబంధలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సవరించింది. ఈ సంస్థలకు రూ.20 లక్షల వరకు ఇచ్చే రుణాలపై ఎలాంటి పూచీకత్తు...
రూ.20 లక్షల వరకు హామీలేని రుణాలు
ముంబై: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ) రుణ నిబంధలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సవరించింది. ఈ సంస్థలకు రూ.20 లక్షల వరకు ఇచ్చే రుణాలపై ఎలాంటి పూచీకత్తు అడగవద్దని బ్యాంకులను ఆదేశించింది. అలాగే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద ఖాదీ గ్రామోద్యోగ పరిశ్రమలకు రూ.20 లక్షల వరకు ఇచ్చే రుణాలకూ ఇదే సూత్రం వర్తింప చేయాలని కోరింది. అయితే ఈ పరిమితికి లోబడి రుణాలు తీసుకునే ఎంఎస్‌ఎంఈలు ఇందుకోసం స్వచ్ఛందంగా బంగారం, వెండి వస్తువులు హామీగా పెడితే బ్యాంకులు అందుకు అంగీకరించడం చట్టవిరుద్ధం కాదని పేర్కొంది. దీంతో బ్యాంకుల ఎంఎస్‌ఎంఈ రూ.20 లక్షల లోపు రుణాలు ఇచ్చేటప్పుడు బంగారం లేదా వెండి పూచీకత్తుగా చూపమని బ్యాంకులు పరోక్షంగా ఒత్తిడి చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దేశంలోని చిన్నచిన్న వ్యాపార సంస్థలకు రుణ సదుపాయాల్ని మరింత చేరువ చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఎంఎస్‌ఎంఈ ఆర్థిక పరిస్థితుల, ట్రాక్ రికార్డు ఆధారంగా బ్యాంకులు వీటికి పూచీకత్తుతో కూడిన రుణాలు రూ.25 లక్షల వరకు మంజూరు చేయవచ్చని సూచించింది.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..