Share News

ఇక బ్యాంకు ఖాతాలకూ పోర్టబిలిటీ!

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:49 AM

బ్యాంకింగ్‌ రంగంలో మరో కీలక సంస్కరణకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సిద్ధమవుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే మీ బ్యాంకు ఖాతాను కూడా..

ఇక బ్యాంకు ఖాతాలకూ పోర్టబిలిటీ!

యోచిస్తున్న ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో మరో కీలక సంస్కరణకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సిద్ధమవుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే మీ బ్యాంకు ఖాతాను కూడా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు అదే ఖాతా నంబరుతో తేలిగ్గా మార్చుకోవచ్చు. పేమెంట్స్‌ విజన్‌, 2028 భాగంగా ఆర్‌బీఐ ఈ కీలక సంస్కరణ తీసుకురావాలని భావిస్తోంది. ఇది సాకారమైతే ఖాతాదారులు తమ మొబైల్‌లో సిమ్‌ కార్డు మార్చినంత సులభంగా, తమ బ్యాంకు ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకోవచ్చు. కొత్త బ్యాంకుకు ఖాతాను పోర్టబిలిటీ చేసుకున్నా.. మీ ఖాతాకు రావాల్సిన చెల్లింపులు, ఈఎంఐలు, సిప్‌లు, బిల్‌ పేమెంట్లు కొత్తగా మారిన బ్యాంకు ద్వారాను యథాతథంగా పూర్తి చేయవచ్చు. దీనివల్ల బ్యాంకింగ్‌ రంగంలో ఖాతాదారుల సేవలు మరింత మెరుగుపడడంతో పాటు బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్

మార్చి 31 డెడ్‌లైన్.. ఈ 3 పనులు వెంటనే పూర్తి చేయండి!

Updated Date - Apr 01 , 2026 | 02:49 AM