Share News

ఆర్థికానికి కష్టకాలం

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:16 AM

పశ్చిమాసియా సంక్షోభం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయని ఆర్‌బీఐ తాజా బులెటిన్‌లో తెలిపింది. ఈ సంక్షోభం కారణంగా ఇంధన ధరలు...

ఆర్థికానికి కష్టకాలం

ఆర్‌బీఐ బులెటిన్‌ వెల్లడి

ముంబై: పశ్చిమాసియా సంక్షోభం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయని ఆర్‌బీఐ తాజా బులెటిన్‌లో తెలిపింది. ఈ సంక్షోభం కారణంగా ఇంధన ధరలు పెరిగిపోయి దాని ప్రభావం ఆర్థిక మార్కెట్లపై పడుతోందని తేల్చి చెప్పింది. ఆర్థిక వ్యవస్థలోని కొన్ని విభాగాలు పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచినప్పటికీ కొన్ని విభాగాలు మాత్రం మందగించాయని తెలిపింది. ఈ సంక్షోభం అధిక సమయం కొనసాగినట్టయితే ఇంధన, ఇత ర మౌలిక వసతులు ధ్వంసమై ద్రవ్యోల్బణ, వృద్ధి అంచనాలను తారుమా రు చేయవచ్చునని హెచ్చరించింది. అయితే ఈ సంక్షోభం రెండో విడత ప్రభావాలపై అప్రమత్తంగా ఉండక తప్పదని పేర్కొంది. కాని పటిష్ఠంగా ఉన్న భారత ఆర్థిక మూలాలు కొంత వరకు సంక్షోభాన్ని తట్టుకోగల శక్తిని ఆర్థిక రంగానికి అందిస్తాయన్న ఆశాభావం ప్రకటించింది.

740 కోట్ల డాలర్ల కొనుగోలు: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీయ కరెన్సీని ఆదుకునేందుకు ఫిబ్రవరి నెలలో ఆర్‌బీఐ స్పాట్‌ కరెన్సీ మార్కెట్‌ నుంచి 740.9 కోట్ల డాలర్లను కొనుగోలు చేసింది. మొత్తం మీద ఫిబ్రవరిలో ఆర్‌బీఐ నికరంగా 2140.3 కోట్ల డాలర్లను కొనుగోలు చేయగా 1399.4 కోట్ల డాలర్లను విక్రయించింది.

ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 24 , 2026 | 05:16 AM