Share News

సహాయ చర్యలపై బ్యాంకులకు స్వేచ్ఛ

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:37 AM

విపత్తుల ప్రాంతాల్లోని రుణగ్రహీతలను ఆదుకునే విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది...

సహాయ చర్యలపై బ్యాంకులకు స్వేచ్ఛ

ముంబై: విపత్తుల ప్రాంతాల్లోని రుణగ్రహీతలను ఆదుకునే విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఇలాంటి ప్రాంతాల్లోని రుణగ్రహీతల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు లేకపోయినా, వారిని ఆదుకునేందుకు బ్యాంకులు తమంతట తామే సహాయ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సంవత్సరం జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పుర్కొంది. బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో పాటు అఖిల భారత ఆర్థిక సంస్థలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..

Updated Date - Apr 30 , 2026 | 04:37 AM