రాంకీ ఇన్‌ఫ్రా లాభం రూ.52 కోట్లు
ABN , Publish Date - May 29 , 2026 | 02:01 AM
రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్..మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.521.66 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.52.11 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్..మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.521.66 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.52.11 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.543.65 కోట్ల ఆదాయంపై రూ.12.04 కోట్ల నష్టాలను నమోదు చేసింది. కాగా మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,041.54 కోట్ల ఆదాయంపై రూ.282.77 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మార్చి త్రైమాసికంలో కొత్తగా రూ.4,500 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకోవటంతో మొత్తం ఆర్డర్ బుక్ రూ.13,000 కోట్లకు చేరుకుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.