రాఖీ పండగ వ్యాపారం.. రూ.30,000 కోట్లు
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:51 AM
సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ. ఈ ఏడాది రాఖీల దేశవ్యాప్త విక్రయాలు దాదాపు రూ.25,000 కోట్లకు చేరుకోవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా...
న్యూఢిల్లీ: సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ. ఈ ఏడాది రాఖీల దేశవ్యాప్త విక్రయాలు దాదాపు రూ.25,000 కోట్లకు చేరుకోవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ఈ నెల 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా మిఠాయిలు, డ్రైఫ్రూట్స్, బహుమతులు, వస్త్రాలు, ఎలకా్ట్రనిక్స్ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను కూడా కలిపితే మొత్తం వ్యాపారం రూ.30,000 కోట్లు దాటనుందని సీఏఐటీ అంటోంది. అందులో ఢిల్లీ మార్కెట్ వాటాయే రూ.4,000 కోట్ల స్థాయిలో ఉండనుందని ఈ అసోసియేషన్ పేర్కొంది. గడిచిన 2-3 ఏళ్ల నుంచి చైనా రాఖీల వరద తగ్గిందని.. కొనుగోలుదారులు దేశీయంగా తయారైన రాఖీలు, స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారని సీఏఐటీ జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ అన్నారు. ముఖ్యంగా యువ కొనుగోలుదారులు థీమ్ బేస్డ్ రాఖీల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని ఆయన చెప్పారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ విక్రేతలపై రుసుము పెంపు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉత్పత్తులను విక్రయించే విక్రేతల నుంచి వసూలు చేసే రుసుము, జరిమానాను పెంచాయి. త్వరలోనే పండగ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అతి తక్కువ మార్జిన్లతో ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వ్యాపారం చేస్తున్న చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకిది భారంగా పరిణమించనుందని విక్రేతలంటున్నారు. అమెజాన్ ఇండియా తన విక్రేతల ఫోరమ్‌లో జారీ చేసిన నోటీసు ప్రకారం.. పెంచిన చార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. అమెజాన్ తన విక్రేతలకు ఆఫర్ చేస్తున్న ఈజీ షిప్, సెల్ఫ్ షిప్ సర్వీసులకు సంబంధించి ఆర్డర్ రద్దు రుసుమును పెంచింది. కాగా, ఫ్లిప్‌కార్ట్ తన విక్రేతలకు ఆర్డర్ల సరఫరాలో లోపాలు, వైఫల్యాలకు సంబంధించి ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చేలా మూడంచెల జరిమానా విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!