Share News

రూ.20,000 కోట్ల లాభం టార్గెట్‌

ABN , Publish Date - Jul 27 , 2026 | 03:21 AM

ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు...

రూ.20,000 కోట్ల లాభం టార్గెట్‌

పీఎన్‌బీ ఎండీ అశోక్‌ చంద్ర

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడిచిన నాలుగు త్రైమాసికాల్లో ప్రతి త్రైమాసికంలో రూ.5,000 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జిస్తుండడంతో నిర్దేశిత లక్ష్యాన్ని సాఽధించగలమని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశోక్‌ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో కూడా ఇదే తరహా వృద్ధి ధోరణి కొనసాగిందని, రానున్న త్రైమాసికాల్లోనూ లాభదాయకత వృద్ధి నమోదైతే ప్రతి త్రైమాసికంలో కొత్త గరిష్ఠ స్థాయి లాభాలతో ఈ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోగలమని చెప్పారు. కాగా ఆర్‌బీఐ ఇటీవల ఆక్విజిషన్‌ ఫైనాన్స్‌కు మార్గం సుగమం చేయడంతో మూడో త్రైమాసికం నుంచి ఆక్విజిషన్‌ ఫైనాన్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు చంద్ర చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 03:21 AM