Share News

పీఎన్‌బీ లాభం రూ.5,225 కోట్లు

ABN , Publish Date - May 06 , 2026 | 03:11 AM

ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...

పీఎన్‌బీ లాభం రూ.5,225 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.5,225.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 12.54 శాతం వృద్ధి చెందింది. రైటాఫ్‌ చేసిన రుణాల నుంచి రికవరీలు పెరగటం, ఫీజు బేస్‌ అధికంగా ఉండటం కలిసివచ్చిందని బ్యాంక్‌ పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.36,705 కోట్ల నుంచి రూ.36,319 కోట్లకు తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.3 డివిడెండ్‌ను బ్యాంక్‌ బోర్డు సిఫారసు చేసింది.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 03:11 AM