ప్రభుత్వరంగ బ్యాంకుల జోరు
ABN , Publish Date - May 13 , 2026 | 02:12 AM
ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎ్‌సబీ) వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకులు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని..
2025-26లో రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎ్‌సబీ) వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకులు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. దీంతో వరుసగా నాలుగో సంవత్సరంలోనూ ఈ బ్యాంకులు లాభాల బాటలో సాగినట్లయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఆస్తుల నాణ్యతలో మెరుగుదల, రుణాల విస్తరణ, అధిక ఆదాయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో పీఎ్‌సబీల లాభదాయకత మెరుగుపడటానికి దోహదపడినట్టు పేర్కొంది. మొత్తం నిర్వహణ లాభం రూ.3.21 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మొత్తం నికర లాభం 11.1 శాతం పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1.98 కోట్లకు చేరినట్టు పేర్కొంది. 2026 మార్చి 31నాటికి పీఎ్‌సబీల మొత్తం వ్యాపారం 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 12.8 శాతం పెరిగి రూ.283.3 లక్షల కోట్లకు చేరింది.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత