Share News

ఐటీ వ్యయాలు పెంచేందుకు బ్యాంకుల సన్నాహాలు

ABN , Publish Date - May 04 , 2026 | 02:05 AM

ఖాతాదారుల డేటా, ద్రవ్యపరమైన అంశాలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ).. ఐటీ వ్యయాలు భారీగా పెంచేందుకు...

ఐటీ వ్యయాలు పెంచేందుకు బ్యాంకుల సన్నాహాలు

  • సైబర్‌ ముప్పుల నేపథ్యంలో చర్యలు

న్యూఢిల్లీ: ఖాతాదారుల డేటా, ద్రవ్యపరమైన అంశాలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ).. ఐటీ వ్యయాలు భారీగా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్‌ మైథోస్‌ ఏఐ టూల్‌తో ఫైనాన్షియల్‌ డేటా, సెక్యూరిటీపై తీవ్ర ప్రభావం పడనుందన్న అంచనాలతో బ్యాంకులు తమ సెక్యూరిటీ సిస్టమ్స్‌ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాయి. ఇందుకనుగుణంగానే ఐటీ వ్యయాలు పెంచాలని నిర్ణయించాయి. ఆంథ్రోపిక్‌ మైథోస్‌ నేపథ్యంలో బ్యాంకు లు తమ రక్షణ వ్యవస్థలను మరింత పటిష్ఠం చేసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ప్రస్తుతం బ్యాంకులు సైబర్‌ అటాక్స్‌తో పాటు డేటా రక్షణపరంగా పలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ఐటీ వ్యయాలు తప్పనిసరిగా పెంచాల్సి వస్తోందని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ స్వరూప్‌ కుమార్‌ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - May 04 , 2026 | 02:05 AM