Share News

ప్రుడెన్షియల్‌ చేతికి భారతి లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ABN , Publish Date - May 18 , 2026 | 03:07 AM

బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే ప్రుడెన్షియల్‌ పీఎల్‌సీ.. భారత బీమా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా సునీల్‌ మిట్టల్‌...

ప్రుడెన్షియల్‌ చేతికి భారతి లైఫ్‌ ఇన్సూరెన్స్‌

రూ.3,500 కోట్లతో 75ు వాటా కొనుగోలు

న్యూఢిల్లీ: బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే ప్రుడెన్షియల్‌ పీఎల్‌సీ.. భారత బీమా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా సునీల్‌ మిట్టల్‌ నేతృత్వంలోని భారతి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఈక్విటీలో 75 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.3,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత జీవిత బీమా, ఆరోగ్య బీమా రంగాల్లో పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొనుగోలు జరిపినట్టు ప్రుడెన్షియల్‌ తెలిపింది. బీమా రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రుడెన్షియల్‌కు ఉన్న అనుభవానికి, భారత్‌లో తమ ప్లాట్‌ఫామ్‌ చక్కగా ఉపయోగపడుతుందని సునీల్‌ మిట్టల్‌ తెలిపారు. అయితే ఈ మెజారిటీ వాటా కొనుగోలు రెగ్యులేటరీ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని రెండు సంస్థలు ప్రకటించాయి. కాగా ఐసీఐసీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని జీవిత బీమా సంస్థలో ప్రుడెన్షియల్‌ పీఎల్‌సీకి 22 శాతం వాటా ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 03:07 AM