Share News

ఏపీ యూనిట్‌లో సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి షురూ

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:21 AM

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద 101 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ సెల్స్‌ తయారీ యూనిట్‌లో ఉత్పత్తిని...

ఏపీ యూనిట్‌లో సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి షురూ

ప్రీమియర్‌ ఎనర్జీస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద 101 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ సెల్స్‌ తయారీ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ప్రకటించింది. రూ.3,293 కోట్ల పెట్టుబడితో ఏటా 7,000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి అవసరమయ్యే సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో మరెక్కడా ఇంత భారీ స్థాయిలో సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి చేసే యూనిట్‌ లేదని తెలిపింది. ఈ యూనిట్‌తో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ వార్షిక సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యం 10,600 మెగావాట్లకు చేరింది. అత్యాధునిక టన్నెల్‌ ఆక్సైడ్‌ పాసివేటెడ్‌ కాంటాక్ట్‌ (టాప్‌కాన్‌) టెక్నాలజీతో కంపెనీ నాయుడుపేట ప్లాంట్‌ను నిర్మించింది.

ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 22 , 2026 | 05:21 AM