పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లాభం రూ.38.23 కోట్లు
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:16 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ రూ.38.23 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని...
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ రూ.38.23 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.33.26 కోట్లతో పోల్చితే దాదాపు 15 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,248.80 కోట్ల నుంచి రూ.1,617.34 కోట్లకు పెరిగింది.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!
కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?