రిటైల్ రుణాలపై పండగ ఆఫర్లు: పీఎన్‌బీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:06 AM
రిటైల్ రుణాల మార్కెట్లోనూ ఫెస్టివల్ ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ‘పీఎన్‌బీ ఉత్సవ్ ఫెస్టివిటీస్- 2026’ పేరుతో..
న్యూఢిల్లీ: రిటైల్ రుణాల మార్కెట్లోనూ ఫెస్టివల్ ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ‘పీఎన్‌బీ ఉత్సవ్ ఫెస్టివిటీస్- 2026’ పేరుతో ఇందుకు శ్రీకారం చుట్టింది. పండగల సీజన్‌లో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలతో పాటు ఇతర రిటైల్ రుణాలు తీసుకునే వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా గృహ, కారు లోన్లపై కనీస ప్రాథమిక వడ్డీ రేటుపై 0.05 శాతం రాయితీతో పాటు అప్ ఫ్రంట్, ప్రాసెసింగ్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..