Share News

గ్రామీణ ప్రాంతాలపై ఫోన్‌పే దృష్టి

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:42 AM

ఫోన్‌పే తన వ్యాపారుల నెట్‌వర్క్‌ను పెంచుకోవడంతో పాటు దేశంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్‌ చెల్లింపుల...

గ్రామీణ ప్రాంతాలపై ఫోన్‌పే దృష్టి

న్యూఢిల్లీ: ఫోన్‌పే తన వ్యాపారుల నెట్‌వర్క్‌ను పెంచుకోవడంతో పాటు దేశంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్‌ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మరింత విస్తరించాలనుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది కాలంలో 20 వేలకు పైగా ఫ్రంట్‌లైన్‌ సేల్స్‌ సిబ్బందిని నియమించుకోవాలనుకుంటోంది. వచ్చే 12 నెలల కాలంలో స్మార్ట్‌ స్పీకర్లు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) డివైజ్‌లు సహా 50 లక్షలకు పైగా పేమెంట్‌ డివైజ్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ డివైజ్‌ల లో దాదాపు 50 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని ఫోన్‌పే భావిస్తోంది.

ఈ వార్తలనూ చదవండి

వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్

Updated Date - Sep 25 , 2026 | 04:42 AM