పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నాలుగు రోజుల్లో రెండోసారి..
ABN , Publish Date - May 19 , 2026 | 07:34 AM
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం నాలుగు రోజుల్లో ఇది రెండో సారి.
ఇంటర్‌నెట్ డెస్క్: వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం నాలుగు రోజుల్లో ఇది రెండో సారి. మే 15వ తేదీన లీటర్ పెట్రోల్‌పై 3 రూపాయలు.. లీటర్ డీజిల్‌పై కూడా 3 రూపాయలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 94.77 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర 97.77 రూపాయలు.. 87.67 రూపాయలు ఉన్న డీజిల్ ధర 90.67 రూపాయలు అయింది. ధరలు పెరిగాయని బాధపడుతున్న వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌పై 87 పైసలు పెరిగి 98.64 రూపాయలకు చేరింది. డీజిల్‌పై 91 పైసలు పెరిగి 91.58 రూపాయలకు చేరింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని మెట్రోపాలిటన్ సిటీలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ముంబైలో పెట్రోల్‌పై 91 పైసలు.. డీజిల్‌పై 94 పైసలు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌పై 96 పైసలు పెరిగి 109.70 రూపాయలు అయింది. డీజిల్‌పై 94 పైసలు పెరిగి 96.07 రూపాయలు అయింది. చెన్నైలో పెట్రోల్‌పై 82 పైసలు పెరిగి 104.49 రూపాయలు అయింది. డీజిల్‌పై 86 పైసలు పెరిగి 96.11 రూపాయలు అయింది.
మరింత పెరగనున్న ధరలు?..
రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆంక్షలను సడలించింది. మే 17వ తేదీ వరకు రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆదివారంతో అమెరికా విధించిన గడువు ముగిసింది. అమెరికా ఆంక్షల కారణంగా భారత్.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపి వేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ఆయిల్ సంక్షోభంతో అల్లాడుతున్న ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
సీఎం విజయ్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్..