Share News

స్కైరూట్‌ పవన్‌ కుమార్‌

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:57 AM

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్‌ కుమార్‌ చందన అంతర్జాతీయ స్థాయిలో...

స్కైరూట్‌ పవన్‌ కుమార్‌

టైమ్‌ 100 నెక్ట్స్‌ ఇండియా జాబితాలో

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్‌ కుమార్‌ చందన అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వర్ధమాన నాయకులతో ప్రతిష్ఠాత్మక టైమ్‌ మేగజైన్‌ తొలిసారిగా రూపొందించిన ‘టైమ్‌ 100 నెక్ట్స్‌ ఇండియా 2026’ జాబితాలో పవన్‌ కుమార్‌కు చోటు లభించింది. 2018లో ఏర్పాటైన ఈ స్పేస్‌ టెక్‌ స్టార్టప్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ కొత్త శిఖరాలకు చేరుతోంది. గత జూలైలో ఈ సంస్థ రూపొందించిన విక్రమ్‌-1 రాకెట్‌ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఒక భారతీయ ప్రైవేటు కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన రాకెట్‌ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పవన్‌ కుమార్‌ చందన, నాగ భరత్‌ డాకా కలిసి ప్రైవేట్‌ రాకెట్‌ కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో స్కైరూట్‌ ఏర్పాటుకు బీజం పడింది. వీరిద్దరిరూ ఇస్రోలో పని చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

సర్కారు బ్యాంకులకు లాభాల పంట

వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..

Updated Date - Nov 20 , 2026 | 05:57 AM