పాసివ్ ఫండ్స్‌తో విశ్వసనీయ రాబడులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:53 AM
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. బ్లూచిప్ కంపెనీల షేర్లు సైతం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోవుతున్నాయి. దీంతో మదుపరులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి...
ఖర్చులు తక్కువ, పారదర్శకత ఎక్కువ
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. బ్లూచిప్ కంపెనీల షేర్లు సైతం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోవుతున్నాయి. దీంతో మదుపరులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కొని మదుపరులకు ఇండెక్స్ ఆధారిత రాబడులు ఇచ్చేందుకు మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలు అందించే పాసివ్ ఫండ్స్ చక్కని అవకాశం అంటున్నారు ఏంజెల్ వన్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ హేమన్ భాటియా. పాసివ్ ఫండ్స్, ఇతర ఎంఎఫ్ పథకాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి బిజినెస్’తో ఇష్ఠాగోష్టిగా ముచ్చటించారు. ఆ వివరాలు..
యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే పాసివ్ ఫండ్స్ బెటర్
పాసివ్ ఫండ్స్ పెట్టుబడులు పూర్తి పారదర్శకతతో స్పష్టమైన నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయి. ఇక్కడ పెట్టుబడి నిర్ణయాలు ఆయా ఇండెక్స్‌ల పనితీరు ఆధారంగా జరుగుతాయి. ఇందులో ఫండ్ మేనేజర్ల నిర్ణయాల ప్రభావం ఏ మాత్రం ఉండదు. దీనికి తోడు కంపెనీల షేర్ల ఎంపిక ప్రక్రియ అంతా ఇండెక్స్ పనితీరు ఆధారంగా ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. కాబట్టి యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే ఖర్చులు కూడా తక్కువ.
ఆశించిన స్థాయిలోనే రాబడులు
షేర్ల ఎంపికలో ఫండ్ మేనేజర్ల పక్షపాతానికి, పొరపాట్లకు కూడా తావు ఉండదు. బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్న ఇండెక్స్‌లోని షేర్లలోనే పెట్టుబడులు ఉంటాయి. దీంతో ఆ ఇండెక్స్ పనితీరును బట్టి రాబడులపైనా ముందే ఒక అంచనాకు రావచ్చు. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు ఆశించే మదుపరుకు పాసివ్ ఫండ్స్ అత్యంత అనువైనవి. కొన్ని సందర్భాల్లో యాక్టివ్ ఫండ్స్ మంచి రాబడులు పంచినా.. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులకు పాసివ్ ఫండ్స్ చక్కటి పెట్టుబడి మార్గం.
పాసివ్ ఫండ్స్‌కు మంచి భవిష్యత్
ఈ పథకాల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) వేగంగా పెరుగుతున్నాయి. మదుపరుల పెట్టుబడుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు ఇది స్పష్టమైన సంకేతం. తక్కువ ఖర్చులు, పారదర్శకత, నిబంధనల ప్రకారం పెట్టుబడులు పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. ముందు ముందు రిటైల్ మదుపరులతో పాటు అన్ని తరగతుల మదుపరుల నుంచి పాసివ్ ఫండ్స్‌కు ఆదరణ మరింత పెరుగుతుందని భావిస్తున్నాం.
పోర్టుఫోలియోలో విభిన్న ఫండ్స్
ప్రస్తుతం ఈక్విటీ, స్థిర ఆదాయం, కమోడిటీ్‌సకు సంబంధించి తొమ్మిది ఈటీఎ్‌ఫలు, ఇండెక్స్ ఫండ్స్ నిర్వహిస్తున్నాం. ఇందులో ఆరు ఈక్విటీ ఆధారిత పథకాలు, రెండు కమోడిటీస్ ఫండ్స్, ఒక డెట్ ఫండ్ ఉన్నాయి. ఏంజెల్ గోల్డ్ వన్ ఈటీఎఫ్, ఏంజెల్ గోల్డ్ వన్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌ఓఎఫ్) పేరుతో రెండు గోల్డ్ ఈటీఎ్‌ఫలను నిర్వహిస్తున్నాం. త్వరలో సిల్వర్ ఈటీఎఫ్ ప్రారంభించాలని చూస్తున్నాం.
రూ.464 కోట్లకు ఏయూఎం
ఏంజెల్ వన్ ఏఎంసీ ఇప్పుడిప్పుడే వృద్ధి బాట పడుతోంది. గత ఏడాది నవంబరు నాటికి పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) మొత్తం రూ.464 కోట్లకు చేరింది. మదుపరుల్లో అవగాహన, పంపిణీ వ్యవస్థను పెంచుకోవడం ద్వారా మరింతగా విస్తరిస్తాం.
కీలకంగా తెలుగు రాష్ట్రాలు
ఏంజెల్ వన్ ఏఎంసీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముఖ్యమైన మార్కెట్లు. ఈ రెండు రాష్ట్రాల్లోని మదుపరుల్లో పెట్టుబడులపై అవగాహన ఎక్కువ. రిటైల్ మదుపరుల్లో యువకులు, తొలిసారిగా పెట్టుబడులకు దిగే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వీరిలో చాలామంది డిజిటల్ పైనాన్షియల్ పెట్టుబడులకు మారుతున్నారు. కంపెనీ మధ్య, దీర్ఘకాలిక వృద్ధిలో తెలుగు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి.
హేమన్ భాటియా,
సీఈఓ, ఏంజెల్ వన్ ఏఎంసీ
ఇవీ చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్! ఈ వారం కూడా దూకుడు తప్పదా..
రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు