Share News

పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ ఏపీ ప్లాంట్‌ విస్తరణ

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:13 AM

డెయిరీ ఉత్పత్తుల సంస్థ పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ తమ పనీర్‌ (కాటేజ్‌ చీజ్‌) తయారీ సామర్థ్యాన్ని నాలుగు రెట్లకు పెంచేందుకు...

పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ ఏపీ ప్లాంట్‌ విస్తరణ

ముంబై: డెయిరీ ఉత్పత్తుల సంస్థ పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ తమ పనీర్‌ (కాటేజ్‌ చీజ్‌) తయారీ సామర్థ్యాన్ని నాలుగు రెట్లకు పెంచేందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏపీలోని పలమనేరు యూనిట్‌, మహారాష్ట్రలోని మంచార్‌ యూనిట్లలో అదనంగా రోజుకు 60మెట్రిక్‌ టన్నుల పనీర్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 20 మెట్రిక్‌ టన్నుల నుంచి 80 మెట్రిక్‌ టన్నులకు పెరగనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 04:13 AM