2026-27లో రూ.350 కోట్ల ఆదాయ లక్ష్యం
ABN , Publish Date - May 22 , 2026 | 05:47 AM
ప్యారడైజ్ పేరుతో బిర్యానీ రెస్టారెంట్స్‌ను నిర్వహిస్తున్న ప్యారడైజ్ పుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సమారా క్యాపిటల్.. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు...
మూడేళ్లలో కొత్తగా 100 రెస్టారెంట్లు ప్యారడైజ్ ఫుడ్‌కోర్ట్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్యారడైజ్ పేరుతో బిర్యానీ రెస్టారెంట్స్‌ను నిర్వహిస్తున్న ప్యారడైజ్ పుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సమారా క్యాపిటల్.. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో కొత్తగా రూ.100 కోట్ల పెట్టుబడితో 100 రెస్టారెంట్లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్యారడైజ్ ఫుడ్‌కోర్ట్ ఎండీ, సీఈఓ అభిక్ మిత్రా, సమరా క్యాపిటల్ ఎండీ నీలాయ్ ప్రతీక్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, బెంగళూరు, చెన్నైల్లో మొత్తం 57 ప్యారడైజ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్నట్లు మిత్రా వెల్లడించారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా తొలి దశలో వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో 50-60 రెస్టారెంట్లను హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. రెండో దశలో ముంబై, పుణె, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రెస్టారెంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్యారడైజ్ ఫుడ్‌కోర్ట్ ఆదాయం 20 శాతం వృద్ధి చెంది రూ.265 కోట్లకు చేరుకుందన్నారు. కార్యకలాపాల విస్తరణతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.350 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News