బెంగళూరులో పౌలోమి కొత్త ప్రాజెక్టు
ABN , Publish Date - Feb 12 , 2026 | 05:23 AM
స్థానిక పౌలోమి ఎస్టేట్స్ తన కార్యకలాపాలను బెంగళూరుకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు నగర ఉత్తర ప్రాంతంలో ‘పౌలోమి ఫ్లోరిక్యూ’ పేరుతో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థానిక పౌలోమి ఎస్టేట్స్ తన కార్యకలాపాలను బెంగళూరుకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు నగర ఉత్తర ప్రాంతంలో ‘పౌలోమి ఫ్లోరిక్యూ’ పేరుతో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు చేపడుతోంది. మొత్తం తొమ్మిది ఎకరాల్లో నాలుగు టవర్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని పౌలోమి ఎస్టేట్స్ ఎండీ ప్రశాంత రావు చెప్పారు. ఈ ప్రాజెక్టులో అన్నీ ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లే ఉంటాయి. ఒక్కో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ కనీస విస్తీర్ణం 1,550 ఎస్‌ఎ్‌ఫటీ నుంచి ప్రారంభం కానుంది. ఐటీ కంపెనీలు, జీసీసీ ఉద్యోగుల నుంచి ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్టు రావు చెప్పారు. ఈ ప్రాజెక్టు అమ్మకం ధరను ఇంకా నిర్ణయించలేదన్నారు.
ఇవి కూడా చదవండి..
దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్ డీల్‌పై రాహుల్ గాంధీ
మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్ ప్రశ్నల వర్షం