హైదరాబాద్‌లో పానటోని మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టు
ABN , Publish Date - May 26 , 2026 | 05:38 AM
ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ ప్రాపర్టీల నిర్మాణంలో ప్రసిద్ధిగాంచిన అంతర్జాతీయ కంపెనీ పానటోని హైదరాబాద్‌లోకి....
రూ.150 కోట్లతో ఏర్పాటు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ ప్రాపర్టీల నిర్మాణంలో ప్రసిద్ధిగాంచిన అంతర్జాతీయ కంపెనీ పానటోని హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తోంది. రూ.150 కోట్ల తో అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. బిల్డ్ టు డెవలప్‌మెంట్ మోడల్‌లో ఏరోస్పేస్ అండ్ ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 10 ఎకరాల స్థలంలో 1.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ యూనిట్‌ను నిర్మించబోతోంది. ఈ జూలైలో నిర్మాణ పనులు ప్రారంభించి 15 నెలల్లో పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ యూనిట్ 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించగలదని అంచనా. పానటోని 2022లో భారత మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించింది.
ఈ వార్తలనూ చదవండి:
రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్