Share News

ఒరాకిల్‌లో 30 వేల మంది ఉద్యోగులను తొలగించే ఛాన్స్?

ABN , Publish Date - Feb 02 , 2026 | 04:22 PM

ఒరాకిల్‌ సంస్థ త్వరలో30 వేల మంది వరకూ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉందన్న వార్త కలకలం రేపుతోంది. ఈ ఉదంతంపై సంస్థ మాత్రం ఇంకా స్పందించలేదు.

ఒరాకిల్‌లో 30 వేల మంది ఉద్యోగులను తొలగించే ఛాన్స్?
Oracle To Layoff 30k Employees

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ 30 వేల మంది వరకూ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉందన్న వార్త అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. ఏఐపై భారీగా పెట్టుబడులకు సంస్థ సిద్ధమైన నేపథ్యంలో ఈ పరిణామం కలకలానికి దారితీసింది. అయితే, ఈ వార్తలపై ఒరాకిల్ ఇంతవరకూ స్పందించలేదు (Oracle 30k Job Cuts).

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒరాకిల్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది (AI Data Centers). ఓపెన్ ఏఐ సంస్థ సహా పలు ప్రధాన కస్టమర్ల కోసం వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం 156 బిలియన్ డాలర్ల నిధులు అవసరం. ఈ దిశగా ఒరాకిల్ కోరిన రుణాలను ఇచ్చేందుకు పలు అమెరికన్ బ్యాంకులు విముఖత వ్యక్తం చేశాయట. దీంతో, నిధులకు కటకట తలెత్తింది (Funding Crunch). సంస్థ ఈ స్థాయి నిధులను సమకూర్చుకోగలదా? అని ఈక్విటీ, డెట్ ఇన్వెస్టర్లు కూడా సందేహాలను వ్యక్తం చేశారని సమాచారం.

ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు ఒరాకిల్ రంగంలోకి దిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాక సంస్థకు దాదాపు 8-10 బిలియన్ డాలర్ల మేర నిధులు అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఈ నిధులను ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు కేటాయించే యోచనలో సంస్థ ఉందట.


డేటా సెంటర్ల లీజ్‌కు ప్రైవేటు ఆపరేటర్లతో ఒరాకిల్ జరుపుతున్న చర్చలు కూడా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. నిధులు ఏర్పాటు కాకపోవడంతో చర్చలు నిలిచిపోయాయని సమాచారం. గతేడాది ఒరాకిల్ సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది. పునర్‌ వ్యవస్థీకరణ పేరిట లేఆఫ్స్ చేపట్టింది. మరోవైపు, ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒరాకిల్ ఇతర మార్గాలనూ అన్వేషిస్తోంది. తన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ విభాగాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ యూనిట్‌ను ఒరాకిల్ 2022లో 28.3 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది.


ఇవీ చదవండి:

అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..

Updated Date - Feb 02 , 2026 | 05:51 PM