Share News

ఒరాకిల్ లేఆఫ్స్ కలకలం.. కోతలు ఈ విభాగాల్లోనేనా?

ABN , Publish Date - Feb 02 , 2026 | 10:44 PM

ఒరాకిల్ సంస్థలో లేఆఫ్స్ ఉంటాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో కలకలం రేగుతోంది. అసలు ఏ విభాగాల్లో తొలగింపులు ఉండొచ్చు అనే అంశంపై చర్చ మొదలైంది.

ఒరాకిల్ లేఆఫ్స్ కలకలం.. కోతలు ఈ విభాగాల్లోనేనా?
Oracle layoffs

ఇంటర్నెట్ డెస్క్: ఒరాకిల్ సంస్థ త్వరలో లేఆఫ్స్‌ను మొదలెడుతుందన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న ఈ కథనాలపై సంస్థ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. తొలగింపులు ఏ విభాగాల్లో ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. ఏఐపై పెట్టుబడులను సమీకరించేందుకు ఒరాకిల్ లేఆఫ్స్‌ యోచనలో ఉందని తెలుస్తోంది (Oracle Layoffs).

మీడియా కథనాల ప్రకారం, ఒరాకిల్ సంస్థకు చెందిన డేటా సెంటర్ సంబంధిత ఉద్యోగాలపై ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నాన్ కోర్ విభాగాల్లోనూ తొలగింపులు ఉంటాయని సమాచారం. ఇక క్లౌడ్ సేవల మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఈ ఏడాది ఒరాకిల్ సుమారు 45 బిలియన్ డాలర్ల నిధుల సమీకరించేందుకు సిద్ధమైంది. అయితే, సంస్థపై రుణభారం పెరుగుతున్న వైనంపై కొందరు ఇన్వెస్టర్లు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు బాండ్‌హోల్డర్లు జనవరిలో సంస్థపై కోర్టును ఆశ్రయించారు. ఏఐ మౌలిక వసతుల ఏర్పాటుకు నిధుల సమీకరణ కోసం కంపెనీ తను చేస్తున్న ప్రయత్నాలను కొన్ని తమ నుంచి దాచిపెట్టిందని ఆరోపించారు. కాగా, ఏఐ మౌలిక వసతుల కల్పన కోసం ఒరాకిల్‌కు 156 బిలియన్ నిధులు అవసరమని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Departments Impacted).


ఇటీవల మైక్రోసాఫ్ట్ ఏఐ పెట్టుబడులపై కూడా ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఏఐ పెట్టుబడులపై రాబడులు ఆశించిన స్థాయిలో ఉండవన్న భయాలతో ఇన్వె్స్టర్లు అమ్మకాలకు దిగడంతో కంపెనీ షేర్ సుమారు 10 శాతం మేర పతనమైంది. అంతర్జాతీయ టెక్ సంస్థలు అనేక ప్రస్తుతం ఏఐ సాంకేతికతకు అవసరమైన భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వేలకొద్దీ జీపీయూలను కొంటున్నాయి. ఫలితంగా ఒక్కో సంస్థకు ఏడాదికి సగటు 40 బిలియన్‌ల నుంచి 70 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏఐదే జమానా అన్న నమ్మకంతో సంస్థలు భారీ పెట్టుబడులకు అసలేమాత్రం వెనకాడటం లేదు.


ఇవీ చదవండి:

ఒరాకిల్‌లో 30 వేల మంది ఉద్యోగులను తొలగించే ఛాన్స్?

వెండి ఈటీఎఫ్‌ల 'బ్లడ్‌బాత్'.. మధ్యాహ్నం తర్వాత కొంత ఊరట

Updated Date - Feb 03 , 2026 | 10:14 PM