Share News

ఓన్లీ ఫ్యాన్స్ యజమాని లియోనిడ్ కన్నుమూత..

ABN , Publish Date - Mar 23 , 2026 | 08:03 PM

అడల్ట్ కంటెంట్ ప్లాట్‌ఫామ్ ‘ఓన్లీ ఫ్యాన్స్’ యజమాని లియోనిడ్ రాడ్విన్స్కీ మృతిచెందారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు.

ఓన్లీ ఫ్యాన్స్ యజమాని లియోనిడ్ కన్నుమూత..
Leonid Radvinsky

ఇంటర్‌నెట్ డెస్క్: అడల్ట్ కంటెంట్ ప్లాట్‌ఫామ్ ‘ఓన్లీ ఫ్యాన్స్’ యజమాని లియోనిడ్ రాడ్విన్స్కీ మృతిచెందారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఓన్లీ ఫ్యాన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ఈ మేరకు రాయిటర్స్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘లియో రాడ్విన్స్కీ మరణించారని ప్రకటించడానికి మేము ఎంతో విచారిస్తున్నాము. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత లియో ప్రశాంతంగా కన్నుమూశారు. ఈ విషాదకర సమయంలో తమ ప్రైవసీని కాపాడాలని ఆయన కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు’ అని చెప్పారు.


వందల కోట్ల రూపాయల దానాలు..

లియోనిడ్ రాడ్విన్స్కీ యుక్రేనియన్ పోర్ట్ సిటీ ఒడెస్సాలో జన్మించారు. లియోనిడ్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. లియోనిడ్ ఇల్లినాయిస్‌లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2009లో మై‌ఫ్రీకామ్స్ అనే అడల్డ్ సైన్‌ను రూపొందించారు. తర్వాతి నుంచి టెక్నాలజీ కంపెనీల మీద పెట్టుబడులు పెడుతూ వచ్చారు. 2018లో ఓన్లీ ఫ్యాన్స్ మాతృ సంస్థ ‘ఫెనిక్స్ ఇంటర్‌ నేషనల్ లిమిటెడ్‌’ను కొనుగోలు చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. లియోనిడ్ క్యాన్సర్ రీసెర్చ్ కోసం 2024లో ఏకంగా 200 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఉక్రెయిన్‌లో సహాయక చర్యల కోసం కోట్ల రూపాయల సాయం చేశారు.


ఓన్లీ ఫ్యాన్స్‌తో విపరీతమైన ఆదాయం..

అడల్డ్ సైట్ అయిన ఓన్లీ ఫ్యాన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు. ఇదొక పెయిడ్ అడల్ట్ సైట్. ఇందులోని కంటెంట్ చూడాలంటే డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఫ్యాన్స్ సంస్థను 2016లో తండ్రీ, కొడుకులైన గయ్, టిమ్ స్టోక్లీలు 12,500 డాలర్లు (రూ.10.31 లక్షలు)తో మొదలుపెట్టారు. 2018లో వీరి నుంచి ఆ సంస్థను లియోనిడ్ కొనుగోలు చేశారు. కోవిడ్ 19 సమయంలో ఓన్లీ ఫ్యాన్స్‌ విపరీతంగా పాపులర్ అయింది. 2022లో కేవలం డివిడెండ్ల రూపంలో లియోనిడ్ ఏకంగా రూ.2,476.44 కోట్లు సంపాదించారు. ప్రతీ ఏటా వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..

మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Updated Date - Mar 23 , 2026 | 08:08 PM