ఓఎన్‌జీసీకి మళ్లీ వెనెజువెలా చమురు
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:25 AM
ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల అన్వేషణ సంస్థ ‘ఓఎన్‌జీసీ’ మళ్లీ వెనెజువెలాలో చమురు, గ్యాస్ ఉత్పత్తి చేపట్టనుంది. అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని....
అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల అన్వేషణ సంస్థ ‘ఓఎన్‌జీసీ’ మళ్లీ వెనెజువెలాలో చమురు, గ్యాస్ ఉత్పత్తి చేపట్టనుంది. అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (ఓఎ్‌ఫఏసీ) ఇందుకు ఆమోదం తెలిపినట్టు ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు తెలిపారు. అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలతో ఓఎన్‌జీసీ ఆ దేశంలో తనకు వాటా ఉన్న చమురు, గ్యాస్ క్షేత్రాల్లో పూర్తిస్థాయిల్లో ఉత్పత్తి చేపట్టలేకపోయింది. ఇప్పుడు అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ తనకున్న రెండు చమురు, గ్యాస్ క్షేత్రాల్లో ఓఎన్‌జీసీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి పెంచేందుకు, కొత్త క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా అవకాశం ఏర్పడింది. ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌కు.. వెనెజువెలా ప్రభుత్వ రంగ సంస్థ అయిన పీడీవీఎ్‌సఏతో కలిసి శాన్ క్రిస్టోబాల్ అనే చమురు క్షేత్రంలో 40 శాతం వాటా కలిగి ఉంది. ఇదికాకుండా కారాబొబో అనే మరో ప్రాజెక్టులో 11 శాతం వాటా ఉంది. అమెరికా తాజా నిర్ణయంతో మరిన్ని భారత కంపెనీలు.. వెనెజువెలా చమురు, గ్యాస్ క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడింది.
100 డాలర్లకు బ్యారల్ చమురు!
ముడి చమురు సెగ ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు వెంటనే చల్లారకపోతే సెప్టెంబరు 15 కల్లా బ్యారల్ బ్రెంట్ రకం ముడి చమురు ధర 100 డాలర్లకు చేరే అవకాశం ఉందని మిరె అసెట్స్ షేర్‌ఖాన్ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ రకం ముడి చమురు ధర 90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు