Share News

ఒడిశా తీరంలో ఓఎన్‌జీసీకి ‘గ్యాస్‌’ పాట్‌

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:24 AM

ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల అన్వేషణ సంస్థ ఓఎన్‌జీసీ.. ఒడిశాలోని మహానది పరీవాహక ప్రాంతం...

ఒడిశా తీరంలో ఓఎన్‌జీసీకి ‘గ్యాస్‌’ పాట్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల అన్వేషణ సంస్థ ఓఎన్‌జీసీ.. ఒడిశాలోని మహానది పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో గ్యాస్‌ నిక్షేపాలు కనుగొంది. కోణార్క్‌ తీరానికి 43 కిలోమీటర్ల దూరంలోని లోతట్టు సముద్ర జలాల్లో ఈ నెల 18వ తేదీన ఈ నిక్షేపం బయటపడినట్టు కంపెనీ తెలిపింది. ఈ నిక్షేపాల పరిమాణం, వాణిజ్య పద్దతిలో ఉత్పత్తి సాఽధ్యమవుతుందా? లేదా? అనే విషయాలను ఇంకా అంచనా వేయాల్సి ఉందని పేర్కొంది. వాణిజ్య సరళిలో లాభసాటి అయితే వీలైనంత త్వరగా ఈ బేసిన్‌లో మరిన్ని బావులు తవ్వి గ్యాస్‌ ఉత్పత్తి చేపట్టాలని ఓఎన్‌జీసీ భావిస్తోంది. ప్లాటినమ్‌ ఎక్స్‌ప్లోరర్‌ అనే చమురు, సహజ వాయువుల నౌక ద్వారా ఈ ఏడాది జూలై 25న ఓఎన్‌జీసీ ఈ ప్రాంతంలోని సముద్ర జలాల్లో డ్రిల్లింగ్‌ ప్రారంభించింది. మొత్తం 1,623 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్‌ చేయాలని నిర్ణయించగా, 1,441-1,452 మీటర్ల లోతునే గ్యాస్‌ నిక్షేపాలు బయట పడినట్టు తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 22 , 2026 | 05:24 AM