ఓలెక్ట్రా లాభంలో రెండింతల వృద్ధి
ABN , Publish Date - May 30 , 2026 | 02:34 AM
గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ నికర లాభం స్టాండ్‌ఎలోన్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ నికర లాభం స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రెండింతల వృద్ధి చెంది రూ.50.60 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.24.31 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం కూడా 45 శాతం వృద్ధితో రూ.437.96 కోట్ల నుంచి రూ.635.21 కోట్లకు పెరిగింది. కాగా మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ రూ.2,312.17 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.179.53 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఈ వార్తలనూ చదవండి:
మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు