Share News

వచ్చే త్రైమాసికంలో బ్లేడ్‌ బ్యాటరీ టెక్నాలజీతో బస్సుల ఉత్పత్తి

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:17 AM

భారత ఎలక్ట్రిక్‌ బస్‌ విభాగం లో తొలిసారిగా బ్లేడ్‌ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు...

వచ్చే త్రైమాసికంలో బ్లేడ్‌ బ్యాటరీ టెక్నాలజీతో బస్సుల ఉత్పత్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత ఎలక్ట్రిక్‌ బస్‌ విభాగం లో తొలిసారిగా బ్లేడ్‌ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ ప్రకటించింది. వచ్చే త్రైమాసికం నుంచి ఈ బస్సుల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపింది. దేశీయ ఎలక్ట్రిక్‌ బస్‌ విభాగంలో ఈ తరహా బ్యాటరీ ఇదే మొదటిసారని, దీని ద్వారా నిర్వహణపరంగా సామర్థ్యాలను పెంచుకునే అవకాశం లభిస్తుందని ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ ఎండీ మహేశ్‌ బాబు తెలిపారు. క్యూ3లో కంపెనీ ఆదాయం 29% వృద్ధితో రూ.663.60 కోట్లకు చేరుకోగా నికర లాభం మాత్రం 0.13% పెరుగుదలతో రూ.46.68 కోట్లుగా నమోదైంది.

ఇవి కూడా చదవండి:

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

Updated Date - Feb 04 , 2026 | 05:17 AM