Share News

రహదారులపై 4,000 ఎలక్ట్రిక్‌ బస్సులు

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:28 AM

ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్‌) కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ.. వివిధ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా...

రహదారులపై  4,000 ఎలక్ట్రిక్‌ బస్సులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్‌) కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ.. వివిధ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలకు అందించిన ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య 4,000కు చేరింది. హిమాచల్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (హెచ్‌ఆర్‌టీసీ) కోసం 4,000వ బస్సును తయారు చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌ సింగ్‌కు అందజేయటం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు ఒలెకా్ట్ర వెల్లడించింది. అంతేకాకుండా హెచ్‌ఆర్‌టీసీకి అందించిన మొత్తం బస్సుల సంఖ్య 297కి చేరిందని పేర్కొంది. కాగా ఇప్పటి వరకు మరే భారతీయ కంపెనీ ఈ స్థాయిలో ఎలక్ట్రిక్‌ బస్సులను దేశంలో తయారు చేయలేదని తెలిపింది. వివిధ రాష్ట్రాల ఆర్‌టీసీలకు తాము సరఫరా చేసిన 4,000 ఎలక్ట్రిక్‌ బస్సులు ఇప్పటి వరకు 73 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి 6.5 లక్షల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించినట్టు ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 03:28 AM