హైదరాబాద్‌కు న్యూట్రిఫ్రెష్
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:04 AM
వ్యవసాయ, ఆహార రంగంలోని న్యూట్రిఫ్రెష్.. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో...
న్యూఢిల్లీ: వ్యవసాయ, ఆహార రంగంలోని న్యూట్రిఫ్రెష్.. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 2028 మార్చి నాటికి దాదాపు 150 ఎకరాల్లో వాతావరణ నియంత్రిత వ్యవసాయ క్షేత్రాలను నిర్మించనున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం రూ.200-225 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు న్యూట్రిఫ్రెష్ పేర్కొంది. ఇందులో రూ.75 కోట్ల వరకు కంపెనీ సొంతంగా పెట్టుబడి పెట్టనుండగా.. మిగతా మొత్తం రైతు భాగస్వాముల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో 25 ఎకరాల్లో వ్యవసాయ కార్యకలాపాలను సంస్థ నిర్వహిస్తోంది. తాజాగా హైదరాబాద్‌కు విస్తరిస్తోంది. 2027 మార్చి నాటికి ఇక్కడ మరో 25 ఎకరాలను జత చేసుకోవాలని భావిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..