ఎన్‌పీసీఐ భారత్ కనెక్ట్‌తో ఎన్‌టీటీ డేటా జట్టు
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:21 AM
బిజినె్‌స2బిజినెస్ (బీ2బీ) చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. ఎన్‌టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ఇందుకోసం ఎన్‌పీసీఐ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బిజినె్‌స2బిజినెస్ (బీ2బీ) చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. ఎన్‌టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ఇందుకోసం ఎన్‌పీసీఐ భారత్ కనెక్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో డేటా ప్రాసెసింగ్ కోసం ఎస్‌ఏపీ (సాప్) ఈఆర్‌పీ సొల్యూషన్స్ ఉపయోగించే కంపెనీల మధ్య జరిగే బీ2బీ చెల్లింపుల ప్రక్రియ మరింత సులభం అవుతుందని ఎన్‌టీటీ డేటా పేర్కొంది. ట్రాన్స్‌ఫర్మేషన్ నౌ- 2026 పేరుతో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రెండు కంపెనీల మధ్య ఈ భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల కంపెనీల చెల్లింపుల సామర్ధ్యం, పారదర్శకత, మెరుగు పడుతుందని ఎన్‌టీటీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..