సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఎన్‌ఎస్‌ఈ రూ.6,746 కోట్ల సమీకరణ
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:53 AM
ఐపీఓ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ సహా పలు...
ఐపీఓ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ సహా పలు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఎన్‌ఎస్‌ఈ రూ.6,746 కోట్లు సమీకరించింది. బీఎ్‌సఈ వెబ్‌సైట్‌లో బుధవారం అప్‌లోడ్ చేసిన డేటా ప్రకారం.. మొత్తం 150 మంది సంస్థాగత ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు రూ.1,785 చొప్పున ఎన్‌ఎస్‌ఈ మొత్తం 3.77 కోట్ల షేర్లను వీరికి కేటాయించింది. ఈ ఐపీఓలో పెట్టుబడి కోసం సంస్థాగతేతర, రిటైల్ మదుపరులు గురువారం నుంచి బిడ్డింగ్‌లు సమర్పించవచ్చు. ఈ నెల 21న ఇష్యూ ముగియనుంది.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు