ఎన్‌ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:24 AM
దేశంలో అతిపెద్ద ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి
దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్
లిస్టింగ్‌తో అత్యంత విలువైన పది కంపెనీల్లో ఒకటిగా అవతరణ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి బుధవారం ప్రాథమిక ముసాయిదా పత్రాల(డీఆర్‌హెచ్‌పీ)ను సమర్పించింది. ఈ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఎక్ఛేంజ్ రూ.30,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది. అంతేకాదు, మార్కెట్లో షేర్లను నమోదు చేసిన అనంతరం ఎన్‌ఎ్‌సఈ మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. తద్వారా ఎన్‌ఎ్‌సఈ దేశంలోని అత్యంత విలువైన 10 కంపెనీల్లో ఒకటిగా అవతరించనుంది. కో-లొకేషన్ కేసుతోపాటు నియంత్రణ పరమైన అవరోధాల కారణంగా ఎన్‌ఎ్‌సఈ ఐపీఓ ప్రణాళిక దాదాపు దశాబ్దకాలంగా నిలిచిపోయింది.
ఎన్‌ఎస్ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారానే జరగనుంది. ఎక్ఛేంజ్‌లోని పలువురు వాటాదారులకు చెందిన దాదాపు 6 శాతం వాటాకు సమానమైన 14.89 కోట్ల షేర్లను ఓఎ్‌ఫఎస్ ద్వారా విక్రయించనున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో ఎన్‌ఎ్‌సఈ వెల్లడించింది. ఎక్ఛేంజ్‌లో 10.72 శాతం వాటా కలిగిన ఎల్‌ఐసీ మాత్రం షేర్లను విక్రయించడం లేదు. ఎన్‌ఎ్‌సఈ దాదాపు 1.8 లక్షల మంది షేర్‌హోల్డర్లను కలిగి ఉంది. ఐపీఓ కోసం ఎన్‌ఎ్‌సఈ 20మంది మర్చం ట్ బ్యాంకర్లను నియమించుకుంది.
2016లోనూ దరఖాస్తు..
పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10,000 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతి కోరుతూ ఎన్‌ఎ్‌సఈ 2016లోనే సెబీకి పత్రాలు సమర్పించింది. కానీ, పాలన ప్రమాణాలకు సంబంధించిన లోపాలు, కో-లొకేషన్ వివాదం నేపథ్యంలో ఎక్ఛేంజ్‌కు సెబీ ఆమోదం లభించలేదు. దాంతో ఐపీఓకు మార్గం సుగమం చేసుకునేందుకు ఎక్ఛేంజ్ గడిచిన పదేళ్లలో పాలన ప్రమాణాలు, నిబంధనలకు సంబంధించి పలు చర్యలు చేపట్టింది. కో-లొకేషన్ కేసును కూడా ఈమధ్యనే పరిష్కరించుకుంది. ఇందుకోసం సెబీకి రూ.1,388 కోట్లు ఆఫర్ చేసింది.
ఈవారంలోనే రిలయన్స్ జియో సైతం..
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కూడా ఈ వారంలోనే సెబీకి ఐపీఓ పత్రాలను సమర్పించనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా జియో 400 కోట్ల డాలర్లు (రూ.38,000 కోట్లు) వరకు సమీకరించవచ్చన్న అంచనాలున్నాయి. ఈ లెక్కన, ఎన్‌ఎ్‌సఈ ఐపీఓ సైజును మించిపోనుందన్నమాట.
ఎన్‌ఎస్ఈ ఐపీఓలో వాటా
విక్రయించనున్న వాటాదారుల వివరాలు
ఎవరు..? ఎన్నికోట్ల షేర్ల విక్రయం?
ఎస్‌బీఐ 2.48
ఎంఎస్ స్ట్రాటజిక్ (మారిషస్) లిమిటెడ్ 1.60
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వె్‌స్టమెంట్ బోరు 1.19
అరండా ఇన్వె్‌స్టమెంట్ (మారిషస్) 1.12
బ్యాంక్ ఆఫ్ బరోడా 1.10
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ 1.07
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1.07
ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ 1.05
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 0.60
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్