Share News

అదానీ గ్రీన్‌కు నార్వే సావరిన్‌ ఫండ్‌ గుడ్‌బై

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:04 AM

నార్వే సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌.. మరో అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్ల నుంచి తప్పుకుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఈక్విటీలో తమకు ఉన్న కొద్దిపాటి షేర్లను రూ.400 కోట్లకు విక్రయించినట్టు...

అదానీ గ్రీన్‌కు నార్వే సావరిన్‌ ఫండ్‌ గుడ్‌బై

న్యూఢిల్లీ: నార్వే సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌.. మరో అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్ల నుంచి తప్పుకుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఈక్విటీలో తమకు ఉన్న కొద్దిపాటి షేర్లను రూ.400 కోట్లకు విక్రయించినట్టు ఈ ఫండ్‌ను నిర్వహించే నార్జెస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఆర్థిక నేరాలతో కంపెనీకి ఉన్న సంబంధాలతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే భయంతో నార్వే సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. 2024 మేలో ఇదే ఫండ్‌ అదానీ గ్రూప్‌ మరో లిస్టెడ్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ నుంచీ తప్పుకుంది. అయితే ఈ ఫండ్‌ అమ్మిన షేర్లను దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేసినట్టు భావిస్తున్నారు.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 02:04 AM