Share News

6 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఎన్‌ఎండీసీ

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:13 AM

దేశీయంగా ఉక్కు తయారీ కంపెనీల నుంచి డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6 కోట్ల టన్నుల ముడి ఇనుప ఖనిజ ఉత్పత్తిని...

6 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఎన్‌ఎండీసీ

న్యూఢిల్లీ: దేశీయంగా ఉక్కు తయారీ కంపెనీల నుంచి డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6 కోట్ల టన్నుల ముడి ఇనుప ఖనిజ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్‌ఎండీసీ చైర్మన్‌ అమితవ ముఖర్జీ వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల టన్నుల మైలురాయిని అధిగమించామని, ప్రస్తుతమున్న ఇనుప ఖనిజ గనులు, ఎన్‌ఎండీసీ-సీఎండీసీ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) జాయింట్‌ వెంచర్‌ ద్వారా నిర్దేశిత 6 కోట్ల టన్నుల ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 2030-31 నాటికి 30 కోట్ల టన్నుల దేశీయ ఉక్కు తయారీ స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలన్న జాతీయ ఉక్కు విధానం 2017కు అనుగుణంగా.. ఎన్‌ఎండీసీ ఉత్పత్తిని కూడా 10 కోట్ల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖర్జీ వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

భారత జీడీపీ 7 శాతం: మూడీస్‌

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లు

Updated Date - Sep 21 , 2026 | 05:13 AM