ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధర పెంపు
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:51 AM
ప్రభుత్వరంగంలోని ఎన్‌ఎండీసీ బుధవారం హైగ్రేడ్ ఇనుప ఖనిజం ధరను టన్నుకు రూ.150మేర పెంచింది...
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎన్‌ఎండీసీ బుధవారం హైగ్రేడ్ ఇనుప ఖనిజం ధరను టన్నుకు రూ.150మేర పెంచింది. దీంతో దీని ధర టన్నుకు రూ.5,400కు చేరింది. పెంచిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఫైన్స్ ధర (టన్నుకు రూ.4,500)లో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పు చేయలేదు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎన్‌ఎండీసీ ఏర్పాటు చేస్తున్న కేంద్రం నుంచి ఇనుప ఖనిజాన్ని సమకూర్చుకునేందుకుగాను ఆ సంస్థతో స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా (ఎస్‌ఈఐఎల్) ఒప్పందం చేసుకుంది. బఫర్ హబ్ నుంచి నేరుగా సేకరించడం ద్వారా విజయనగరంలోని ఎస్‌ఈఐఎల్ ప్లాంట్ కార్యకలాపాలకు సరఫరా సజావుగా సాగడంతోపాటు రవాణా ఖర్చులు తగ్గడానికి, రవాణాకు పట్టే సమయం తగ్గడానికి అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..