ముడి ఇనుప ఖనిజ ధరల పెంపు
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:18 AM
ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ.. ముడి ఇనుప ఖనిజం ధరలను మరోసారి పెంచింది. లంప్ ఓర్ ధరను టన్నుకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ.. ముడి ఇనుప ఖనిజం ధరలను మరోసారి పెంచింది. లంప్ ఓర్ ధరను టన్నుకు రూ.200, ఫైన్ ఓర్ ధరను టన్నుకు రూ.150 చొప్పున పెంచినట్లు ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో లంప్ ఓర్ ధర టన్నుకు రూ. 5,700, ఫైన్ ఓర్ ధర టన్నుకు రూ.4,850కు చేరింది. అయితే ఇందులో రాయల్టీ, డిస్ట్రిక్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్), నేషనల్ మినరల్ ఎక్స్‌ఫ్లోరేషన్ ట్రస్ట్, జీఎస్‌టీ, ఇతర పర్యావరణ సెస్, రవాణా రుసుములు, తదితర పన్నులను ఈ ధరల్లో చేర్చలేదని ఎన్‌ఎండీసీ స్పష్టం చేసింది. కాగా ప్రసుత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ధరలను పెంచటం ఇది మూడోసారి కావటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం